నవతెలంగాణ – రామారెడ్డి
అర్హులై రుణమాఫీ కానీ రైతులు అధైర్య పడవద్దు, సాంకేతిక కారణాల వల్ల కొందరికి లిస్ట్ లో పేర్లు రాలేవని, పేర్లు రానివారు వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లాలని, ప్రభుత్వం త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయ్యే చూస్తుందని, ఇది రైతుల ప్రభుత్వమని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతులకు భరోసా కల్పిస్తూ సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ కాలేదని, అర్హులైన వారికి పరిశీలించి తప్పకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్న, బి ఆర్ ఎస్ నాయకులు మతిభ్రమించి, రైతులపై రాజకీయం చేస్తున్నారని, వారి హయాంలో ఎంతమందికి రుణమాఫీ చేశారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని, ఏ మొఖం పెట్టుకొని రోడ్లపైకి వస్తున్నారని, బి ఆర్ ఎస్ చేస్తున్న నాటకాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నామని అన్నారు.