– రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి
నవతెలంగాణ-షాబాద్
పంట రుణాలు పొందిన రైతులు కొత్త రుణాలు తీ సుకొని, పంటలు సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిని గీతారెడ్డి అన్నారు. మండల పరిధిలోని తాళ్ల పల్లి, మిద్దెంగూడా, తిమ్మారెడ్డి, గ్రామాలలో మంగళవా రం వ్యవసాయ అధికారి వెంకటేశం తో కలిసి పంట రుణ మాఫీ అయిన రైతుల వివరాలు తెలుసుకుని, మాఫీ పొం దిన రైతులు మళ్లీ కొత్త రుణాలను తిసుకోవాలని వ్యవసా య జిల్లా వ్యవసాయ అధికారి గీత రెడ్డి తెలిపారు. మాఫీ కానీ రైతులకు రెండవ దశ రూ.2 లక్షలు ఆగస్టు 15 లో పు పూర్తిఅయ్యేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందని గుర్తుచేశారు. వర్షాలు అధికంగా కురుస్తున్నం దువలన వర్షాకాలపు పంటలు రైతులు వేయాలని గుర్తు చేశారు.వేసిన పంటలకు ఎన్ని ఎకరాలు ఏఏ పంటలు వే శారు. ప్రతి ఒక్క సమాచారం వ్యవసాయశాఖ అధికా రులకు అందజేయాలని రైతులకు సూచించారు. పండిన పంటలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని వెంటనే వేసి న పంటలు కచ్చితంగా రైతు వేదికలో కార్యాలయంలో అధికారులకు తెలియజేయాలని తెలిపారు.కార్యక్ర మం లో ఏఈవోలు రాజేశ్వరి గీత రైతులు ఆయా గ్రామాల రైతులు తదితరులు ఉన్నారు.