నవతెలంగాణ-మంచిర్యాల
జిల్లాలో గత వారం రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగ చెన్నూరు నియోజకవర్గంలో కాలేశ్వరం బ్యాక్ వాటర్ కింద పంట నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి, సభ్యుడు గుమాస అశోక్ డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లిలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కమిటీ సభ్యులు గుమస అశోక్‌లు మాట్లాడుతూ వందల ఎకరాల పంట నష్టం జరిగిందని, పంటలు నీట మునిగిపోయి రైతులు నష్టపోయారని పేర్కోన్నారు. జిల్లాలో పలు గ్రామాలు వార్డులు నీటిలో మునిగిన పరిస్థితి కూడా ఉందన్నారు. వరదకు చాలా వరకు రోడ్లు దెబ్బ తిన్నాయని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నాయకులు పర్యటనలకే పరిమితం కాకుండ వారి ప్రభుత్వాల ద్వారా తక్షణమే బాధితులకు న్యాయం జరిగేలా కృషి చెయ్యలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి నష్టపోయిన రైతులకు ప్రజలకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు నాగరాజు, గోపాల్, దూలం శ్రీనివాస్, అబ్బోజు రమణ, చల్లూరి దేవదాస్, అరిగెల మహేష్, డోర్కె మోహన్ పాల్గొన్నారు.