సభ్యత్వం తీసుకున్న రైతులు ఇతర గ్రామాలకు పంట దిగుబడులను తీసుకెళ్లవచ్చును


నవతెలంగాణ -పెద్దవూర: రైతు ఉత్పత్తి దారులు కంపెనీలో సభత్వం తీసుకున్న రైతులు తమ మొబైల్ వ్యాన్ ద్వారా పండించిన పంట దిగుబడులను ఇతర గ్రామాలకు సులభంగా తీసుకెళ్లవచ్చని నాబార్డు హైదరాబాద్ రీజనల్ జనరల్ మేనేజర్ పిటి ఉష అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం లింగంపల్లి గ్రామంలోని వ్యవసాయ క్షేత్రం లో రూరల్ మార్టు గేమ్ కింద మంజూరైనా మొబైల్ వ్యాన్ ను జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ఎఫ్ఆర్ఓకీ సంభందించిన అన్ని రకాల కార్యక్రమాలను విక్షించామని తెలిపారు.రైతులు సభత్వం తీసుకున్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదేవిదంగా ఇంకా సభ్యత్వం తీసుకొని రైతులు సభత్వం తీసుకొని మొబైల్ వ్యాన్ సేవలను వినియోగించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు ఉత్పత్తి దారులు ఛైర్మెన్ సోమా కృష్ణమూర్తి, సీఈ ఓ ఆవుల జానారెడ్డి, బోర్డు ఆఫ్ డైరెక్టర్ సోమా పవన్ కుమార్, ఆనంతమ్మ, రమావత్ చీనా నాయక్, చందునాయక్, తరి బిక్షం, రైతులు తదితరులు పాల్గొన్నారు.