మల్లన్నసాగర్ లో భూములు కోల్పోయిన రైతులు అడ్డా మీద కూలీలుగా మారారు: ఈటెల

– ప్రాజెక్టుల నిర్మాణానికి బీజేపీ వ్యతిరేకం కాదు
– దేశంలో పేద ప్రజలకు మోడీ 4 కోట్ల ఇండ్లు కట్టించారు
– మాజీ మంత్రి ఈటెల రాజేందర్
నవతెలంగాణ – తొగుట
మల్లన్నసాగర్ లో భూములు కోల్పోయిన రైతులు అడ్డా మీద కూలీలుగా మారిపోయారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం విజయసంకల్పయాత్ర లో భాగంగా చందాపూర్ నుండి రోడ్ షోలో పాల్గొన్నారు. మం డల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మల్లన్నసాగర్ లో 9 గ్రామాలు మునిగిపోయాయి. ఆ రైతులు అడ్డా మీద కూలీగా మారిపోయారని ఆరోపించారు. ఇళ్లు పోయిన వారికి 250 గజాల జాగా ఇస్తా అన్నారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి కలెక్టర్ ని తెచ్చి దొంగ పట్టాలు ఇచ్చారని, అవి పనికి రాకుండా పోయా యన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి బీజేపీ వ్యతి రేకం కాదు కానీ వెలకట్టలేని బంధం వదిలిపెట్టి వచ్చిన కుటుంబానికి మీరు ఇచ్చే భరోసా ఏమిటి ? వారిని దిక్కులేకుండా చేసింది కేసీఆర్ కాదా ప్రశ్నించారు. మోదీ పేద ఇంటి నుండి వచ్చిన బిడ్డ కాబట్టి పేదల కష్టాలు తీరుస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ ఒక్కరూ ఇళ్లు లేకుండా ఉండకూడదు అని ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించే ప్రయత్నం చేస్తు న్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో పేద ప్రజలకు ఇప్పటికీ 4 కోట్ల ఇల్లు కట్టించి ఇచ్చార న్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తా అని కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేశాడ ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ సిబ్బందికి మోదీ డబ్బులు పంపించక పోతే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. చెట్లు, లైట్లు, మోరీలు, రోడ్లు అన్నీ కేంద్ర నిధులతో నే వేస్తున్నారని చెప్పారు. సఫాయి కార్మికుల కాళ్లు కడిగి మోడీ గౌరవం పెంచితే, కేసీఆర్ 1700 మంది ఉద్యోగాలు తీసివేశారని అన్నారు. కరోనా సమ యంలో దేశానికి ధైరాన్ని అందించి, ప్రపంచానికి వాక్సిన్ అందించిన గొప్ప నేత అని హర్షం వ్యక్తం చేశారు. పేదవాడు అధికారంలో ఉంటే ఏం చేస్తాడో చేసి దేశ ప్రజలకు చూపించారని అన్నారు. అణా నరేంద్ర మోదీ గారు. 500 సంవత్సరాల క్రితం కూలగొట్టిన రామమందిరం తిరిగి నిర్మించారు. అయోధ్యలో రాముడు ఉంటేనే దేశం క్షేమంగా ఉంటుంది అని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టార న్నారు. ఒకప్పుడు భారతదేశం నుండి వచ్చారు అంటే విదేశాలలో చిన్న చూపు ఉండేది, కాని ఇప్పుడు గల్లా ఎగురవేసుకుని నేను భారతీయున్ని అని చెప్పుకొనే స్థాయికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. పదేళ్లక్రితం హైదరాబాద్ పోవాలంటే బాంబులు పేలి చనిపోతారు అనే భయం ఉండేది, మోదీ వచ్చాక బాంబుల మోతలు ఆగిపోయా యన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహి ళకి రూ. 2500, 4 వేల వృద్ధాప్య, 6 వేలు వికలాం గుల పెన్షన్ ఇస్తామన్నారు. రైతులు అప్పులు కట్టవద్దని, నేను వస్తే రూ. 2 లక్షల మాఫీ చేస్తామ ని ఇప్పటి చేసిందేమీ లేదన్నారు. మహిళా సంఘా లకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నారని ఇప్పటికి ఇవ్వలేదన్నారు. మహిళలకు బస్ ఫ్రీ పెట్టారు, కానీ బస్సులు లేవని ఎద్దేవా చేశారు. మోసం, అన్యాయం లేకుండా పాలన సాగాలంటే మోదీ గారు మళ్ళీ ప్రధాని కావాలి అందుకే ఈ విజయసంకల్ప యాత్ర చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి విభీషన్ రెడ్డి, మండల అధ్యక్షుడు, తుక్కాపూర్ మాజీ సర్పంచ్ చిక్కుడు చంద్రం, బొడ్డు నర్సింలు, ఎంపీ టీసీ కంకణాల నర్సింలు, మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక, వివిధ మండలాల నాయకు లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.