కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉంటారు 

– ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ కమ్మర్ పల్లి 
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉంటారని,  వ్యవసాయం పండగ అవుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం వద్ద  మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ. రెండు లక్షల రుణమాఫీని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి మాట్లాడుతూ రైతులకు రెండు లక్షల రుణమాఫి ఇప్పటివరకు దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సాహసం చేసి ఒక్కొక్కటిగా సరిద్దిద్దుకుంటూ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల  రుణమాఫి చేయడానికి సిద్ధమయ్యారన్నారు. ఇక కాలంలో రెండు లక్షల రుణమాఫీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల గుండెల్లో చిరకాలం నిలిచి పోతుందని అన్నారు. ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫి చేస్తామని చెప్పామని ఇచ్చినా మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమన్నారు.ఆగష్టు 15 లోపు అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫి జరుగుతుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రుణ విముక్తిలను  చెయడమే కాకుండా రానున్న రోజుల్లో పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తుంది అన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలెపు నరసయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు  బోనగిరి భాస్కర్, కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడేగల ప్రవీణ్, నాయకులు తక్కురి రేవేందర్, కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.