అకాల వర్షం.. ఆందోళనలో రైతన్నలు

నవతెలంగాణ – ఆర్మూర్  

గత కొన్ని నెలల నుండి ఉక్క పోత నుండి తల్లడిల్లుతున్న ప్రజలు శనివారం ఉదయం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనానికి లోనయ్యారు. కాగా వరి రైతులపై అకాల వర్షాలు విరుచుకుపడ్డాయి. ఆరుగాలం కష్టించి పండించిన వరి పంట తడిసి ముద్దయింది. ఆరబోసిన ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతన్నలు నానా అవస్థలు పడ్డారు. కురిసిన వర్షం రైతుల కంట కన్నీరు పెట్టించింది. పట్టణంలోని పెర్కిట్ నుండి బాల్కొండ వెళ్లే జాతీయ రహదారి శ్రీరాంపూర్ వద్ద వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయినవి. కాగా పట్టణ టి ఎస్ ఆర్ టి సి బస్టాండ్ ఆవరణలో నీళ్లు నిలవడంతో వచ్చిపోయే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.