నవతెలంగాణ-జన్నారం
తమకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని కవ్వాల్, బంగారు తాండా కామన్పల్లి దేవుని గూడా సోనాపూర్ తండా, గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేశారు. మంగళవారం వారు జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు భూక్య సదా సింగ్, రాథోడ్ తిరుపతి, పంచారపుల సురేష్, సుంచు సోనియా రావులు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణమాఫీ తమకు రాలేదని, దీంతో తాము నష్టపోయే ప్రమాదం ఉందని వారు వాపోయారు. తమకు వెంటనే రూ. రెండు లక్షల రుణమాఫీని అమలు చేయాలని కోరారు. ేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాస్తారోకో చేస్తున్న సమయంలో రోడ్డుకి ఇరువైపులా భారీ వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి రైతులకు నచ్చ చెప్పారు. అయినా రైతులు ససేమిరా అనడంతో మండల వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు నచ్చజెప్పడం రైతులు రాస్తారోకో విరమించారు కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.