వేగంగా తెలంగాణ తల్లి విగ్రహం

నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్‌
హైదరాబాద్‌లోని సెక్రటరియేట్‌లో డిసెంబర్‌ 9న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన తెలంగాణ తల్లి విగ్రహం రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో ఓ విగ్రహ రూపకర్త వద్ద రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు దగ్గర తయారవుతున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలించారు. శిల్పిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి ఉన్నారు.