వేగంగా క్లెయింల పరిష్కారం : మీషో

హైదరాబాద్‌: తమ సంస్థ క్రయ, విక్రేతల క్లెయింలను అత్యంత వేగంగా పరిష్కరిస్తున్నట్టు ఈ-కామర్స్‌ వేదిక మీషో తెలిపింది. విక్రేతలను శక్తివంతం చేయడం, పారదర్శక అనుభవాన్ని అందించడంలో నిబద్ధతను కలిగి ఉన్నట్టు పేర్కొంది. వేగవంతమైన పరిష్కారాలు, అధునాతన తనిఖీలు, చురుకైన చర్యలతో విక్రేతల సమాజంలో మరింత నమ్మకాన్ని పెంపొదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది. మే 2024 నుంచి మీషో దాని క్లెయిమ్‌ల ఆమోద ప్రక్రియను గణనీయంగా మెరుగుపరిచి పేర్కొంది. క్లెయిమ్‌ల పరిష్కార సమయాన్ని దాదాపు 70 శాతం వరకు తగ్గించినట్టు తెలిపింది.