– రెండు కుటుంబాల్లో ఆరుగురు మృతి
– కుక్కను తప్పించబోయి బోల్తాపడిన కారు
– వేగంగా ఢీకొీట్టి వెళ్లిన లారీ
– దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా మిర్యాలగూడలో ఘటన
నవతెలంగాణ-మిర్యాలగూడ
మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకుంటా మనేలోపు లారీ రెండు కుటుంబాలను కబలిం చింది. కుక్కను తప్పించబోయి బోల్తా పడిన కారును లారీ వేగంగా ఢీకొీట్టడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కృష్ణమానసి కాలనీ బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం అర్ధరాత్రి జరి గింది. దీనికిు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం లోని నందిపాడు గ్రామానికి చెందిన ఫొటో గ్రాఫర్ చెరుకుపల్లి మహేష్ (35) , అతని భార్య జ్యోతి(30), కుమార్తె రిషిత(8), కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్న అతని తోడల్లుడు వలిగొండ మండలం గోల్నేపల్లి గ్రామానికి చెందిన బొమ్మ మచ్చేందర్(38), అతని భార్య మాధవి, కుమారుడు లియన్సీ(2) ఈనెల 26న దైవదర్శనాలకు కారులో వెళ్లారు. వీరితోపాటు స్నేహితులు కూడా కారులో బయల్దేరారు. ఏపీలోని పెద్దగ్రంచిపోలు, విజయవాడ, ఈనెల 27న మచిలీపట్నం, 28న మోపిదేవి దైవ దర్శనం చేసుకున్నారు. తిరిగి వస్తూ ఆదివారం రాత్రి పది గంటల సమయంలో దామరచర్ల మండలం కొండ్రపోలు వద్ద దాబాలో భోజనం చేశారు. ఆ తర్వాత ఇంటికి కూత వేటు దూరం లో అద్దంకి నార్కట్ పల్లి రహదారిపై కష్ణమానస కాలనీ సమీపంలో కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢకొీట్టింది. రోడ్డుకు మరో వైపు పల్టీ కొట్టి పడిపోగా.. అదే సమయంలో గుంటూరు వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీకొీట్టడంతో కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మాధవికి ఏరియా స్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది. జ్యోతి, మాధవి సొంత అక్కాచెల్లెళ్లు. లారీ ఆగకుండా వెళ్లగా అద్దంకి వద్ద పోలీసులు పట్టుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ వెంకటగిరి, టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలా నికి చేరుకొని ప్రమాదం వివరాలు తెలుసు కున్నారు. మృతదేహాలను ఏరియాస్పత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.
పలువురు పరామర్శ
బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు పరామ ర్శించారు. ఏరియా ఆస్పత్రిలో మృతదేహాలను సందర్శించి కుటుంబీకులను ఓదార్చారు. వెంట మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్, కాంగ్రెస్ పట్టణా ధ్యక్షులు గాయం ఉపేందర్‌రెడ్డి, నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, తలకొప్పుల సైదులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లాధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వ ర్లు, రామ్మూర్తి, నాయుడు ఉన్నారు.
అన్నీ తానైన మేనత్త..
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని నాగులపాడు అన్నారం గ్రామానికి చెందిన నారాయణ – మంగమ్మ దంపతుల కుమార్తెలు జ్యోతి, మాధవి. నారాయణ మద్యానికి బానిసై ఇంటి విషయాలను పట్టిం చుకోకపోవడంతో భార్యాభర్తలు 13 ఏండ్ల కిందట విడిపోయారు. దాంతో మంగమ్మ తల్లి గారైన బేతవుల్లో ఉంటోంది. అప్పటికే 16 సంవత్సరాల వయస్సున్న జ్యోతి, 13 ఏండ్లు ఉన్న మాధవిని మిర్యాలగూడలో ఉంటున్న మేనత్త దేవులపల్లి పద్మ-నాగభూషము దత్తత తీసుకున్నారు. వారికి అప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. అయినా, ఇద్దరు అమ్మాయిలను మేనత్త చదివించి.. పెండ్లిళ్లు చేసింది. జ్యోతికి మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడుకు చెందిన మహేష్‌తో వివాహం జరిగింది. మాదవికి గోల్నేపల్లికి చెందిన మచ్చేందర్‌తో వివాహమైంది. ఇరు కుటుంబాలు దైవదర్శనం కోసం వెళ్లి ప్రాణం కోల్పోడంతో మిర్యాలగూడలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.