నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

– ఆర్టీసీ బస్సును ఓవర్‌టెక్‌ చేయబోయి లారీని ఢకొీట్టిన కారు
– నలుగురు విద్యార్థులు మృతి
నవతెలంగాణ-గండిపేట్‌

హైదరాబాద్‌ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం చోటుచేసుకుంది. రంగారెడ్డి నార్సింగి శివారులో ఆర్టీసీ బస్సును ఓవర్‌టెక్‌ చేయబోయి ఆగి ఉన్న లారీని కారు ఢకొీట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘట నపై నార్సింగి డీసీపీ మీడియాకు వివరించారు. నిజాంపేట ప్రాంతా నికి చెందిన 12 మంది విద్యార్థులు శంకర్‌పల్లి నుంచి గండిపేట వైపు ఉసెన్‌ పార్క్‌ వెళ్తున్నారు. నార్సింగి వద్దకు రాగానే ఆర్టీసీ బస్సును ఓవర్‌టెక్‌ చేస్తూ ముందు ఆగి ఉన్న లారీని కారు ఢకొీట్టింది. ఈ ఘటనలో అంకిత (17), నితిన్‌ (20), అమృత్‌ (18) ఆర్షిత (18) మృతి చెందారు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారు ముందు సీట్లో కూర్చున్న ప్రసాద్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.. కాగా, ఈ ప్రమాదానికి అతివేగం, అజాగ్రత్తతో కారును నడపడటమేనని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలిపారు. మృతులంతా నిజాంపేట ప్రాంతానికి చెందిన వారని గుర్తించినట్టు చెప్పారు. పూర్తి సమాచారం సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ తెలిపారు.