నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని 44వ జాతీయ రహదారిపై స్థానిక ఎడ్ల కట్ట వాగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన విరాళాలు ప్రకారం మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాను ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి ఢీకొనడంతో గోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా రోడ్డు మొత్తం బ్లాక్ అవ్వడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన వాహనాలను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వ్యాను డ్రైవర్ పరారీలో ఉన్నారు.