రోహిత్ నందా, ఆనంది జంటగా నో ఐడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రంజిత్.ఎస్ నిర్మించిన చిత్రం ‘విధి’. శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ రచన, దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో నిర్మాత రంజిత్ మాట్లాడుతూ, ”విధి’ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఆడియెన్స్ అందరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
‘ఆడియో డిస్క్రిప్టివ్ టెక్నాలజీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. కంటి చూపు లేని వాళ్లు కూడా ఈ సినిమాని అనుభూతి చెందగలరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పది లక్షల మంది కంటి చూపు లేని వాళ్లున్నారు. అందులో 90 శాతం మంది థియేటర్‌కు వెళ్లి ఉండకపోవచ్చు. వాళ్లంతా థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను ఆస్వాదించవచ్చు. ఢిల్లీలోని సాక్ష్యం ఫౌండేషన్ ఈ యాప్ తయారు చేయడంలో సహాయం చేసింది. యూట్యూబ్ ద్వారా శ్రీకాంత్, శ్రీనాథ్ పరిచయం అయ్యారు. అలా మా ప్రయాణం ప్రారంభం అయింది. ఆనందితో కంఫర్టబుల్‌గా పని చేశాను’ అని హీరో రోహిత్ నందా చెప్పారు. దర్శకులు మాట్లాడుతూ, ‘ఇది మాకు మొదటి సినిమా. అందర్నీ తప్పకుండా మెప్పిస్తుంది’ అని అన్నారు.