నవతెలంగాణ – మోర్తాడ్
మండలం దొనకల్ గ్రామానికి చెందిన ఎం రవీందర్55 తన కుమారుడు శివరాజ్ 25ఇద్దరు ద్విచక్ర వాహనంపై ఆర్మూర్ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్తుండగా వేల్పూర్ మండలం అంసాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో తండ్రీకొడుకులు మృతి సంఘటన చోటుచేసుకుంది. తండ్రి రవీందర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉండడంతో తన వైద్య పరీక్షల నిమిత్తం ఉదయం ఆసుపత్రికి పెద్ద కుమారుడు శివరాజును తీసుకొని ఆస్పత్రికి వెళుతుండగా ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందారు. గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో పండుగ పూట విషాద ఛాయలు అలుముకున్నాయి. రవీందర్ డయాసిస్ వైద్య పరీక్షల కోసం పెద్ద కుమారుడు శివరాజుని తీసుకొని ఉదయం ఆసుపత్రికి వెళుతుండగా అంసాపూర్ వద్ద ఆగి ఉన్న వాహనాన్ని గమనించకపోవడంతో ఆ వాహనాన్ని ఢీకొన్నట్లు తెలిసింది.