కుమార్తె పెళ్లి రోజే గుండెపోటుతో తండ్రి మృతి 

నవతెలంగాణ-శంకరపట్నం : శంకరపట్నం మండలం అంబాల్ పూర్ గ్రామంలో  పెళ్లిరోజె ఆగిన తండ్రి గుండే పెళ్లి బాజాలు మోగవలసిన ఇంట్లో కుటుంబ సభ్యుల రోదనలు  మిన్నంటాయి.అంబాల్ పూర్ గ్రామానికీ చెందిన ఎర్రల రాములు -మంజుల దంపతులకు ముగ్గురు కుమార్తెలు పెద్ద కుమార్తె లావణ్య పెళ్లి స్థానిక దేవాలయంలో ఆదివారం పెళ్లి జరగనుండగా ఉదయమే రాములుకు సాతిలో నొప్పి రావడంతో వెంటనే హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మరణించినట్ట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పెళ్లి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.