నవతెలంగాణ – కామారెడ్డి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరగనున్న కామ్రేడ్ డి వి కృష్ణ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పోస్టర్స్ ను ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల ఆటో కార్మికులతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ కామారెడ్డి జిల్లా నాయకులు ఏ ప్రకాష్ మాట్లాడుతూ సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణ విప్లవోద్యమ నిర్మాణం కోసం జీవితాంతం కృషి చేసిన మార్గదర్శడన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విప్లవోద్యమ ఎత్తుగడలు పోరాటాలని మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిరూపించిన విప్లవ కార్యదీక్షకుడు అన్నారు. మార్క్సిజం అంటే పిడివాదం కాదని శాస్త్రీయ సోషలిజమని భారత విప్లవకారులు ఇట్టి విషయం అర్థం చేసుకోవాలని భారత విప్లవ ఉద్యమానికి గొప్ప విప్లవ సిద్ధాంతాన్ని అందించిన ఉద్యమ యోధుడు అన్నారు. భారతదేశంలో విప్లవోద్యమం పురోగమనానికి భారతదేశ పరిస్థితులను అధ్యయనం చేసి విప్లవ ఎత్తుగడలను అందించిన విప్లవ రణధీరుడు అని ఆయన పేర్కొన్నారు. కామ్రేడ్ డివికె విగ్రహ ఆవిష్కరణ నవంబర్ 09న ఆర్మూర్ లో ఉంది అని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క మేధావి హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విగ్ర ఆవిష్కరణను ముఖ్య అతిథిగా సీపీఐ(ఎంఎల్)మాస్ లైన్ కేంద్ర కమిటీ సభ్యులు కే జి రామచంధర్ ఆవిష్కరించనున్నరని, తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ, రమేష్, సురేష్, ఎల్లన్న, కుమార్ తదితరులు పాల్గొన్నారు.