
మున్సిపల్ పరిధిలోని,మామిడిపల్లి నలంద ప్రి- స్కూల్ నందు శుక్రవారం ఫాదర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ పిల్లల ఉజ్వల భవిష్యత్లో తండ్రీ కీలక పాత్ర ఉంటుందని సమాజంలో ఉండే మంచి చెడుల వ్యత్యాసం గురించి వివరిస్తారని వారి పిల్లల భవిష్యత్ ఉన్నతంగా ఉండటానికి తాను కష్ట పడుతుంటాడు అని తెలిపారు. ప్రిన్సిపల్ సాగర్ మాట్లాడుతూ పిల్లల అభివృద్ది తండ్రి అధ్వయంలోనే మొదలవుతుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మొదట విద్యార్థులు వారి యొక్క ఫాదర్స్ నీ పరిచయం చేశారు. తర్వాత పిల్లలకు, ఫాదర్స్ కు అట పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సెలబ్రేషన్స్లో పిల్లలు, తండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఇట్టి కార్యక్రమంలో ప్రి స్కూల్ ఉపాధ్యాయులు అరుంధతి , శ్రావణి , నవనీత , మమతా , జ్యోతి ,అపూర్వ , విద్యార్థినీ విద్యార్థులు పాటశాల యాజమాన్యం పాల్గొని విజయవంతం చేశారు.