– గ్రామపంచాయతీ మాజీ పాలకవర్గానికి ఘన సన్మానం
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
రాజకీయ నాయకులు పదవి లేకున్నా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజాసేవకే అంకితం అవ్వాలని ఎంపీపీ పడిగల మానస అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల ఫాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామీడి రమణా రెడ్డి ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ అంకారపు అనిత, ఉప సర్పంచ్ పెద్దురి తిరుపతి,పాలకవర్గానికి శనివారం అభినందన సభ ఏర్పాటు చేసి వారిని ఘనంగా సత్కరించారు. మాజీ సర్పంచులు, రాజకీయ నాయకులు, గ్రామస్తులు, మాజీ పాలకవర్గాన్ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ… పదవులు ఉన్నా లేకున్నా ప్రజాసేవలో ఎప్పుడూ ఉండాలని వారు కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం దిశగా ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలన్నారు. పదవి కాలం ఉన్నన్ని రోజులు గ్రామ అభివృద్ధికి ఎంతో పాటు పడ్డారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తంగళ్ళపల్లి ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు,నాయకులు పాల్గొన్నారు.