– ఫారెస్ట్ అధికారి పై ఇటీవల కాలంలో గ్రామస్తుల దాడు
– పోలీసుల బలగాల మధ్య కందకాలు తవ్వకం
నవతెలంగాణ-రాజంపేట్ ( భిక్కనూర్ ) : అటవీ భూములను కబ్జా చేసిన, అటవీ శాఖ అధికారులపై దాడులు చేసిన శాఖాపరమైన చర్యలు తప్పవని ఎఫ్డిఓ రామకృష్ణ హెచ్చరించారు. వివరాలు ఇలా ఉన్నాయి గత కొన్ని రోజుల క్రితం రాజంపేట్ మండలంలోని షేర్ శంకర్ తండా గ్రామంలోని కొందరు వ్యక్తులు సమీపంలోని అటవీ ప్రాంతంలో బోరు వేసి, చదును చేయడంతో విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతానికి చేరుకోగా గ్రామంలోని కొందరు వ్యక్తులు ఫారెస్ట్ అధికారులపై దాడులు చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. మంగళవారం ఫారెస్ట్ అధికారులు, పోలీస్ బలగాల మధ్య షేర్ శంకర్ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లకుండా, అటవీ ప్రాంతాన్ని కబ్జా చేయకుండా జెసిబిల సహాయంతో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో కందకాలు తీశారు. ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడులను దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో పోలీసుల కవాతు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఐ సంపత్ కుమార్, ఎస్సై పుష్పరాజ్, ఎఫ్ ఆర్ వో రమేష్, సంతోష, ఓంకార్, వాసుదేవ్, ఎఫ్ ఎస్ ఓ సయ్యద్ బాబా, బీట్ ఆఫీసర్లు, భారీ పోలీసు బలగాలు, పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.