భయం!

Fear!బీజేపీ అనుచరగణం చేస్తున్న విద్వేష ప్రసంగాలకు, దేశద్రోహ ప్రకటనలకు ఎక్కడా కేసులు ఫైల్‌కావు. చంపి తలలు తెమ్మన్నవాడు నిర్భయంగా తిరుగుతుంటాడు. ప్రజాస్వామ్యం కోసం మాట్లాడితే మాత్రం దేశద్రోహులై పోతారు. ఇప్పుడు దేశంలో జర్నలిజం, నిజాయితీతో కూడిన జర్నలిజం దేశద్రోహమై పోయింది. జర్నలిస్టులకు, ఉగ్రవాదులకు మధ్య తేడాను బీజేపీ ప్రభుత్వం చెరిపివేసింది. ఐదు నెలలుగా మణిపూర్‌లో హత్యలు, విధ్వంసాలకు పాల్పడుతున్నవారిని కట్టడి చేయలేకపోయిన ప్రభుత్వం, ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికలను, పాత్రికేయులను, రచయితలను జైళ్లలోకి తోసేస్తున్నది. ఇవన్నీ పరిశీలిస్తున్నప్పుడు మళ్లీ ఎమర్జెన్నీ చీకటిరోజులు గుర్తుకొస్తున్నాయి.

భయం మనిషిని బరితెగించేందుకు పురికొల్పుతుంది. ఇప్పుడు భయం అది óకారానికి పట్టుకుంది. ఇది మరింత భయంకరమైనది. ఏమైనా చేస్తుంది. విలువ లను విధ్వంసమొనరుస్తుంది. వ్యవస్థలను కూల్చేస్తుంది. ఆనాడు అధికారం తన చేతుల నుంచి పోతుందనే భయమే అత్యవసర పరిస్థితికి కారణమైంది. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ. ఇప్పుడు కూడా అధికారానికి, అధికార భయం పట్టుకుంది. అందుకే అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోంది. కుర్చీ కూలుతోందన్న భయం క్రూరచర్యలకు పూనుకుంటోంది. కేంద్ర మాజీ అధికారి చెప్పినట్టు మార్షల్‌లా అమలులో వున్నట్లు దేశం పరిస్థితులు కనపడుతున్నాయి. ‘అభద్రతలో వున్న రాజకీయ నాయకుడు మాత్రమే విధ్వంసాలకు ఎగదోస్తాడు’ అని అన్న రిటైర్డ్‌ న్యాయమూర్తి అశోక్‌ గంగూలీ మాటలు అక్షర సత్యాలు. మోడీ విధ్వంసం చేస్తున్నది వ్యవస్థలను, విలువలను, రాజ్యాంగాన్ని. ఒక అప్రజాస్వామిక ఆలోచన, నియం తృత్వ ఆలోచన రాజ్యం చేస్తున్నపుడు ప్రజాస్వామిక ఆలోచనాపరులందరూ జైళ్లలోనే వుంటారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఏదో ఒక పేరుతో ప్రజా స్వామ్యగొంతును నొక్కేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రశ్నించే మీడి యాపై అక్రమ కేసులు బనాయిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు ప్రసిద్ధ రచయిత్రి అరుంధతీరారు గొంతునూ నొక్కేందుకు అక్రమ కేసును ప్రయోగిస్తున్నది.
వీళ్లకు ఎంత భయమేస్తున్నదనేది, వారి చర్యలతో బయట పడుతున్నది. సత్యవాక్కుల నీడను కూడా చూసి భయపడేంత భయం పట్టుకుంది వీళ్లకు. ఎప్పుడో 2010లో అరుంధతిరారు చేసిన ప్రసంగాన్ని దేశద్రోహ ప్రసంగంగా నేడు నిర్ధారణ చేస్తున్నారు. అంతేకాదు, ఆమె 1998 నుండి రాస్తున్న ‘ద ఎండ్‌ ఆఫ్‌ ఇమాజినేషన్‌’ వ్యాసాలపై ఆరోపణలతో కేసు పెట్టారు. ఆమెతో పాటు మాజీ ప్రొఫెసర్‌ షేక్‌ షౌకత్‌ హుస్సేన్‌ల పైన భారత శిక్షాస్మృతి 153ఏ, 153బి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి సాక్ష్యాలు న్నాయని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. వీళ్లిద్దరూ దేశద్రోహం నేరం కంటే తీవ్రంగా ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు. మరో విచిత్రమేమంటే వీరి తో పాటుగా మరణించిన సయ్యద్‌ అలీషా జిలానీ, అబ్దుల్‌ రహమన్‌ జిలానీలపై పదమూడేళ్ల క్రితం సుశీల్‌ పండిట్‌ చేసిన ఫిర్యాదు ననుసరించి ఈ నిర్ణయం చేయటం గమనించదగ్గ విషయం. న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర కాయస్త, హెచ్‌.ఆర్‌. డైరెక్టర్‌, చక్రవర్తిలను అరెస్టు చేసినప్పుడు చేపట్టిన నిరసన కార్యక్రమంలో అరుంధతీరారు పాల్గొన్నారు. ఇది జరిగిన వారంలోనే ఆమెపై కేసు నమోదు చేశారు. ఏ ఒక్క గొంతూ స్వేచ్ఛకోసం ప్రజాస్వామ్యం కోసం ఎత్తకుండా జాగ్రత్త పడటమంటే అర్థం ఇదే. దేశంలోని సామాజిక అస మానతల మీద, దోపిడీ దుర్మార్గాలపైన, మతోన్మాదాలపైన కొన్ని దశాబ్దాలుగా వైవిధ్యమైన రచనలు చేస్తున్న అరుంధతీరారుపై దేశద్రోహం, ఉపా కేసులు నమోదు చేయడటం దుర్మార్గమైన విషయం.
న్యూస్‌క్లిక్‌పైన కూడా ఏరకమైన సాక్ష్యాలు, రుజువులు లేకుండానే కేసులు పెట్టారు. తీవ్రవాద చర్యలు లేకుండానే తీవ్రవాద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇప్పటివరకు కోర్టుకు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆధారాలు చూపలేదు. మరి ఆధారాలు చూపేందుకు అబద్ధపు, అసత్యపు రుజువుల కోసం ప్రయత్నాలు జరుగుతుండొచ్చు. కేసు పూర్వాపరాలు ఎలా వున్నా, ప్రశ్నించేవారిని, ప్రశ్నలు సంధించే పత్రికలని సహించబోమని ప్రభుత్వం చెబుతోంది. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమానికి అద్దం పట్టడమే న్యూస్‌క్లిక్‌ చేసిన అఫరాదం! అది దేశ ద్రోహమై పోయింది. ఇక చైనాతో సంబంధాలు, డబ్బు లావాదేవీలు ఉన్నాయని మరో తప్పుడు అభియోగం. ఇదే కేసులో సీపీఐ(ఎం)కార్యాలయంపై దాడులు, కార్యదర్శి కార్యాలయం సోదాలు వారి విద్వేషపూరిత రాజకీయాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
బీజేపీ అనుచరగణం చేస్తున్న విద్వేష ప్రసంగాలకు, దేశద్రోహ ప్రకటనలకు ఎక్కడా కేసులు ఫైల్‌కావు. చంపి తలలు తెమ్మన్నవాడు నిర్భయంగా తిరుగుతుంటాడు. ప్రజాస్వామ్యం కోసం మాట్లాడితే మాత్రం దేశద్రోహులై పోతారు. ఇప్పుడు దేశంలో జర్నలిజం, నిజాయితీతో కూడిన జర్నలిజం దేశద్రోహమై పోయింది. జర్నలిస్టులకు, ఉగ్రవాదులకు మధ్య తేడాను బీజేపీ ప్రభుత్వం చెరిపి వేసింది. ఐదు నెలలుగా మణిపూర్‌లో హత్యలు, విధ్వంసాలకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయలేకపోయిన ప్రభుత్వం, ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికలను, పాత్రికేయులను, రచయితలను జైళ్లలోకి తోసేస్తున్నది. ఇవన్నీ పరిశీలిస్తున్నప్పుడు మళ్లీ ఎమర్జెన్నీ చీకటిరోజులు గుర్తుకొస్తున్నాయి. అంతకంటే దారుణంగా ప్రభుత్వచర్యలు కనిపిస్తున్నాయి. ఓటమి భయం పెరుగుతున్న కొద్దీ మరిన్ని దాడులు పెరగవచ్చు. జర్నలిస్టులు, రచయితలకు ఇప్పుడు ప్రజల అవగాహన, చైతన్యవంతులుగా ఉండటమే పెద్ద రక్షణ కవచం.