హీరోయిన్ వేదిక లీడ్ రోల్‌లో నటించిన సినిమా ‘ఫియర్’. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందించారు. ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్స్‌లో సూపర్ హిట్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ డా. హరిత గోగినేని మాట్లాడుతూ, ‘మా సినిమాకు ప్రేక్షకులు, మీడియా నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఇంటర్నేషనల్ జ్యూరీ ఉండే అవార్డ్స్‌లో 70కి పైగా అవార్డ్స్ గెల్చుకోవడం మామూలు విషయం కాదు. అలాగే యూనిక్ కలర్ ప్యాట్రన్‌లో ఇంత వరకు ఏ సినిమా రాలేదు. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ హర్రర్ కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది’ అని అన్నారు.