భయం భయంగా ప్రయాణం

భయం భయంగా ప్రయాణం– అధ్వానంగా మారిన రోడ్డు..
– ప్రమాదకరంగా మారిన గుంతలు
– చౌడాపూర్‌ టూ జాకారం రోడ్డులో ఏర్పడిన గుంతలు
– ఏండ్లుగా మరమ్మతులకు నోచుకుని రోడ్లు
– తరుచు ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు
– పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-కుల్కచర్ల /చౌడాపూర్‌
చిన్న వర్షం పడితే చాలు రోడ్లంతా జలమయ మవుతుంది. చౌడాపూర్‌ మండల కేంద్రం నుంచి విఠలాపూర్‌, జాకారం, గుబ్బడితండా, హిర్లవాగు తాండ, హర్యానాయక్‌ తండాకు వెళ్లే రోడ్డు అంతా గుంతలు గుంతలుగా ఏర్పడి, ఆధ్వానంగా మారడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారులు సైతం దెబ్బతిని ఆధ్వానంగా మారాయి. రోడ్డుకు మరమ్మతులు చేయాలని గతంలో చాలాసార్లు ఆయా గ్రామాల ప్రజలు వేడుకున్న అధికారులు అవేవీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఎత్తుపల్లాలుగా మారిన రోడ్లలో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. రహదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దీంతో నిత్యం ఏదొక మార్గంలో వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి సమయాల్లో రహదారుల్లో గుంతలను గుర్తించలేకపోతున్నారు. దీనికితోడు ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గుంతల్లో పడే అవకాశం ఉండటంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.
రోడ్లు ఇలా ఉంటే ప్రయాణం ఎలా చేయాలి
మండలంలో గుబ్బడ0తండా, హిర్లవా గుతాండా, హర్యానాయక్‌ తాండ నుండి జాకారం వెళ్లే గ్రామీణ రోడ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. శిథిలమైన గతుకుల రోడ్లపై ప్రయాణాలు చేయడం వాహన చోదకులకు గగనంగా మారింది. సంవత్సరాల క్రితం నిర్మించిన రోడ్లు పట్టించుకోకపోవడంతో రోడ్లు మొత్తం గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలి.
నిల్య నాయక్‌ హీర్లవాగు తండా వాసి
ఈ రోడ్లపై వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నాం
మండల కేంద్రం నుంచి విఠలాపూర్‌, జాకారం వరకు ఉన్న రహదారి అధ్వానంగా తయా రైంది. రోడ్డు వేసి ఏండ్లు గడు స్తున్న మరమ్మతులు చేపట్టక పోవడంతో రాకపోకలకు ఇబ్బం దులు ఎదుర్కొం టున్నాం. అత్య వసర పరిస్థితిలో మండల కేంద్రానికి వెళ్ళాలంటే వెళ్లలేక పోతున్నాం. రోడ్లు ఇలా ఉంటే ప్రయాణాలు ఎలా చేయాలి. రోడ్డుపై వర్షపు నీరు నిలవడంతో ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాత్కాలికంగా గుంతలు పూడ్చి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.
పండుగ చెన్నయ్య విఠలాపూర్‌ గ్రామ వాసి