– బయటకు రావాలంటేనే భయపడుతున్న జనం
– కుక్కలు బెడదను నివారించాలని స్థానికులు వేడుకలు
నవతెలంగాణ – బొమ్మలరామారం
బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామంలో వీధి కుక్కలు రోజురోజుకు పెరుగిపోతున్నాయి. విధుల్లో స్పైరవిహారం చేస్తున్నాయి, చిన్నపిల్లలను బయటకి ఆడుకోవడానికి పంపాలంటే తల్లులు జంకుతున్నారు. విధులు గుంపులు గుంపులుగా స్పైరవిహారం చేస్తుండడంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లి రావాలన్నా ఆచితూచి ముందుకు అడిగేయాల్సిన పరిస్థితి.. బైకుపై వెళ్తున్నప్పుడు కంగారు.. పిల్లలను పనుల మీద బయటకు పంపించాలన్నా భయం… భయం చిన్నారులు ఇంటిముందు సరదాగా ఆడుకోవాలని ఆందోళన తప్పడం లేదు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని, ఏ కుక్క ఎక్కడినుంచి దాడికి తెగబడి ప్రాణాలు తీస్తుందేమోనన్న భయంతో గ్రామ ప్రజలు కాలాన్ని గడుపుతున్నారు. కుక్కలు బెడద రోజు రోజుకు అధికమవుతున్న ఎవరు ఈ సమస్యను పట్టించుకోవడంలేదని పలువురు వాపోతున్నారు.గతంలో వీధి కుక్కల బారిన పడి చిన్నారులు గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు ముత్యాల నరేందర్ రెడ్డి తన పొలం వద్ద దూడను రాత్రి సమయంలో బయట కట్టి వేయడంతో అట్టి దూడను వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఇలా చాలామంది రైతులు యొక్క బర్రెలు, ఆవులు, మేకలపై వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. అంతేకాకుండా చాలామంది కుక్క కాటుకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో వీధి కుక్కలు అరుస్తుండడంతో నిద్ర పట్టని పరిస్థితులు నెలకొంటున్నాయి.రోడ్డుపై తిరుగుతున్న వాహనాలపై వెళ్లేవారిని వెంబడిస్తూ వారిని గాయాలపాటు చేస్తున్నాయి.మండల కేంద్రంలో పాటు వివిధ గ్రామాల్లో సమీపంలోని కల్వర్టుల వద్ద చెరువులు వద్ద కోళ్ల వ్యర్ధాలను తింటున్న కుక్కలు వాహనాల దారుల పైకి వస్తున్నాయి.రోడ్డు పక్కనే వ్యర్ధాలు పారపోయవద్దని అధికారులు ఫిర్యాదు వచేసిన పట్టించుకోవడంలేదని స్థానికులు చెబుతున్నారు.ఎవరు లేని సమయంలో వీధి కుక్కలు మూగజీవులను చంపి దూరం తీసుకెళ్లి తింటున్నాయి.చాలామంది బాధితులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స చేయించుకుంటున్నారు.అధికారులు మాత్రం విఫలమవుతున్నారు. చాలా గ్రామాల్లో తరచూ ఇలాంటి దాడులు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు మాత్రం ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

కర్ర లేనిదే బయటకు రాలేని పరిస్థితి
విధుల్లో కుక్కలు చేస్తుండడంతో గ్రామ ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తుంది. వివిధ పనులు నిమిత్తం కాలినడక బయటకు వెళితే చేతిలో కర్ర లేకుండా బయటకు వెళ్లలేక పోతున్నామని పలువురు వాపోతున్నారు. ఇప్పటికీ గ్రామాల్లో పలువురు చిన్నారులతో పాటు పెద్ద వారు కుక్క కాటుకు గురయ్యారు.అయినా వీధి కుక్కలు నియంత్రణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు కరువయ్యయన్న ఆరోపణలు ఉన్నాయి.వీధి కుక్కలు నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన ఆయా శాఖల అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇబ్బందులు పడుతున్నా
గ్రామంలో కుక్కల బెడదతో ఇబ్బందులు పడుతున్నాం.గత కొన్ని రోజుల ముందు పాములపర్తి రాందాస్ చారి కి వీధి కుక్క అతి దారుణంగా దాడి చేసి గాయపరిచింది,కాలనీ వాసులు అది మరవక ముందే మరో వీధి కుక్క పాములపర్తి పరమేశ్ చారికి కాలుకి కాటు వేసి గాయం చేసింది, వరుసగా రెండు ఘటనలు జరగడంతో కాలనీ వాసులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు, తక్షణమే అధికారులు పట్టించుకుని వీధి కుక్కల నుండి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.