హీరోయిన్ వేదిక లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఫియర్’. బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈ సినిమా లాంచ్ అయింది. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు హరిత గోగినేని ఈ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో నటులు మురళీ మోహన్ పాల్గొని స్క్రిప్ట్ అందించగా, డైరెక్టర్ కరుణాకరన్ క్లాప్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తేజ కాకుమాను, హీరో సోహైల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. హీరోయిన్ వేదిక మాట్లాడుతూ, ‘నా క్యారెక్టర్ మల్టీ డైమెన్షన్స్‌తో ఉంటుంది. డైరెక్టర్ హరిత గోగినేని ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ స్క్రిప్ట్ రెడీ చేశారు’ అని అన్నారు. ‘మంచి టీమ్ దొరికింది. ప్రేక్షకులకు నచ్చేలా స్క్రీన్ మీదకు ఈ సినిమా తీసుకొస్తాను’ అని డైరెక్టర్ హరిత గోగినేని చెప్పారు. నిర్మాత ఏఆర్ అభి మాట్లాడుతూ, ‘హరిత నా వైఫ్. మా సంస్థలో లక్కీ లక్ష్మణ్ సినిమాకు వర్క్ చేసింది. ఆ మూవీకి చాలా క్రాప్ట్స్ సూపర్ విజన్ చేసేది. ప్రతి పనిలో డెడికేటెడ్ గా ఉంటుంది. ఆమె డైరెక్షన్ కూడా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలదు అని నమ్మకం ఉంది. ఫియర్ స్క్రిప్ట్‌ను చాలా బాగా రాసుకుంది. ఇందులో వేదిక ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో కనిపించబోతోంది’ అని తెలిపారు.