హీరోయిన్ వేదిక లీడ్ రోల్‌లో నటించిన సినిమా ‘ఫియర్’. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా.వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఈ మూవీని రూపొందించారు. అరవింద్ కష్ణ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్‌లో 70కి పైగా అవార్డులను గెల్చుకుని, కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ఏఆర్ అభి మాట్లాడుతూ, ‘హీరోయిన్ వేదిక మా మూవీకి ఎంతో సపోర్ట్ చేశారు. నాలుగు భాషల్లో హీరోలతో టీజర్ రిలీజ్ చేయించారు. నా వైఫ్ హరిత స్క్రిప్ట్ మీద పూర్తి నమ్మకంతో మూవీ చేసింది. మా సినిమా టీజర్, పాటలు చూడండి. మీకు నచ్చితే థియేటర్స్‌కు వెళ్లి చూడండి. గురువారం నుంచి పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా 70% బుకింగ్స్ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది’ అని చెప్పారు. డైరెక్టర్ డా. హరిత గోగినేని మాట్లాడుతూ, ‘ఇది స్క్రీన్ ప్లే ఓరియెంటెడ్ మూవీ. సరికొత్త స్క్రీన్ ప్లే ఉంది కాబట్టే 70 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఫీమేల్ డైరెక్టర్స్ మనకు చాలా తక్కువ. మీ ఇంట్లో అమ్మాయి తీసిన సినిమా అనుకుని ఈ సినిమాని చూసి ఆదరించండి’ అని తెలిపారు.