ఫీచర సునీతారావు సాహిత్య పురస్కారాలకు కథలు, కవితలు, విమర్శలు ఆహ్వానం

ఫీచర సునీతారావు పౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫీచర సునీతారావు పేరుతో పురస్కారాలు అందించనున్నారు. ఇందుకు కవిత్వం, కథలు, విమర్శ అనే మూడు సాహిత్య విభాగాల నుంచి సంపుటులను ఆహ్వానిస్తున్నారు. మార్చి 2020 నుంచి మార్చి 2023 వరకు వెలువడిన రచనలే పంపించాలి. ఎంపికైన ప్రతి సంపుటానికి రూ.15,000/- పురస్కారం అందివ్వనున్నారు. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్‌ 15 లోగా ఫీచర సునీతారావు పౌండేషన్‌, కేర్‌ ఆఫ్‌ విజయేందర్‌ రావు, ప్లాట్‌ నం. 505, బ్లాక్‌ -డి, భీమా ఫ్రైడ్‌ అపార్ట్‌మెంట్స్‌, సుచిత్ర సర్కిల్‌ దగ్గర, జీడిమెట్ల, హైదరాబాద్‌- 67, తెలంగాణ చిరునామాకు పంపాలి. వివరాలకు 9866043441, 9848698699 నంబర్ల నందు సంప్రదించవచ్చు.