
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఫిబ్రవరి 7 వ తేదీన నిర్వహించే మాదిగల ఐక్యత సభను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా కళానేత కోఆర్డినేటర్ నల్ల మహేందర్ అన్నారు. ఎస్సీ ఏ బి సి డి వర్గీకరణ న్యాయమైన పోరాటానికి అనుకూలంగా అనేక కులాలు మద్దతు నిస్తున్నాయని ఫిబ్రవరి 7 వ తేదీన వెయ్యి గొంతుకలు లక్ష డప్పులతో హైదరాబాద్ లో నిర్వహించే ఐక్యత సభకు మండలం నుండి భారీ సంఖ్యలో ఎస్సీ ఉపకులాలు హాజరై విజయవంతం చేయాలని అన్నారు. ఫిబ్రవరి 7న జరిగే ఏబిసిడి వర్గీకరణ ఐక్యత సభను విజయవంతం చేసేందుకు నిజామాబాద్ లో ఈనెల 23 న నిర్వహించే సన్నాహక సమావేశం సందర్భంగా మండలంలోని ప్రతి గ్రామానికి తిరిగి కళాకారులతో ఈరోజు రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ గారు హాజరవుతున్నారని మండలం నుండి అధిక సంఖ్యలో హాజరు కావాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆకారం రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో చింతల సాయన్న, నవీన్, శిరీష్, సతీష్, లాలు, నర్సింలు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.