– వేం నరేందర్‌రెడ్డికి టీపీడీపీఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని టీపీడీపీఎంఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డిని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొజ్జ సూర్యనారాయణరెడ్డి, కార్యదర్శి యాద రామకృష్ణ నేతృత్వంలో బుధవారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న టోకెన్లను విడుదల చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రయివేటు కాలేజీ యాజమాన్యాల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న టోకెన్లను విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీడీపీఎంఏ వర్కింగ్ ప్రెసిడెంట్ పరమేశ్వర్, కోశాధికారి శంకర్, ఉపాధ్యక్షులు జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.