
– ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలకు తనవంతు సహకారం ఉంటది
– మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ కంఠేశ్వర్
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు కృషి చేయాలని మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కి నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్యం బృందం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ నగరంలో సుదర్శన్ రెడ్డి ని వారి నివాసంలో ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల బృందం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు.గత మూడు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విడుదల కాకపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని కాలేజీల యాజమాన్యాలు సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారిని కలిసి విన్నవించుకున్నారు. వేల మంది విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్న ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో అటు విద్యార్థులు ఇటు కళాశాలల సిబ్బంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు. గత సంవత్సర కాలం నుండి సిబ్బంది జీతభత్యాలు కూడ చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు.భవనాల అద్దెలు కూడ చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలను తీసుకు వెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని విన్నవించారు. కళాశాల యాజమాన్యాల నుండి సమాచారం తెలుసుకున్న సుదర్శన్ రెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందించారని కళాశాలల యాజమాన్యం అన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి ఒక వారం పది రోజుల్లో బకాయిలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని అన్నారు.
సీనియర్ నాయకులైన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కి కళాశాలల విద్యార్థులు, యాజమాన్యాలు సిబ్బంది రుణ పడి ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల నుండి యాజమాన్యాలు పాల్గొన్నారు. వారిలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షులు హరిప్రసాద్, కార్యదర్శి సంజీవ్, మారయ్య గౌడ్, నిశిత రాజు, సూర్యప్రకాష్, శంకర్, జైపాల్ రెడ్డి, నరాల సుధాకర్, గిరి, దత్తు, శ్రీనివాస్, రషీద్, రమణ, వెంకటేష్ , తదితరులు పాల్గొన్నారు.