నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమీషరేటు పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ యందు ఫిర్యాదు దారుల సంబంధించి వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ సిబ్బంది స్పందించిన తీరు, పోలీస్ సిబ్బంది పట్ల ప్రజలు ఏ విధంగా తమ అభిప్రాయం తెలియజేయాలనుకుంటున్నరో అందుకోసం క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ వెల్లడించారు. ఈ క్యూఆర్ కోడ్ పద్దతిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 9 న రాష్ట్ర డి.జి.పి కార్యాలయం నుండి ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ క్యూఆర్ కోడ్ వలన పోలీసుల గురించి ప్రజల నుండి వారి అభిప్రాయాలను సేకరించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ పోస్టర్లు జనరద్దీ గల ప్రదేశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున పౌరులు ఈ క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.