సరికొత్త అనుభూతినిస్తుంది

Feel brand newసైన్స్‌ ఫిక్షన్‌, మైథాలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్‌’. మన పురాణాలు, ఇతిహాసాల గురించి, శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి రాబోతున్న ఈ చిత్రం ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా కథానాయికలు స్రవంతి ప్రత్తిపాటి, మాసస వీణ ఆదివారం మీడియాతో ముచ్చటించారు.
ఆ కాన్సెప్ట్‌ సర్‌ప్రైజ్‌ చేస్తుంది : మానస వీణ
‘చాలా షార్ట్‌ ఫిల్మ్‌తోపాటు కొన్ని హాలీవుడ్‌ వెబ్‌సీరిస్‌లు చేశాను. ఇది నా తొలి సినిమా. నన్ను అడిషన్‌ చేసిన తరువాత అరుణి ఆచార్య అనే పాత్రకు సెలక్ట్‌ చేశారు. కథ వినగానే సైన్స్‌ ఫిక్షన్‌కు మైథాలజీని కనెక్ట్‌ చేసి, టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో సినిమా నేపథ్యం ఉండటం నన్ను ఆకర్షించింది. ఈ కాన్సెప్ట్‌ ప్రేక్షకుల్ని కూడా సర్‌ప్రైజ్‌ చేస్తుంది. దర్శకుడు కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ సినిమా పట్ల ఎంతో ప్యాషన్‌ ఉన్న వ్యక్తి. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం యూఎస్‌లోనే జరిగింది’.
అకిరాగా అలరిస్తా : స్రవంతి పత్తిపాటి
‘అమెరికాలో జాబ్‌ చేస్తూ కొన్ని హాలీవుడ్‌ చిత్రాల్లో కూడా నటించాను. చాలా స్టేజీషోలు, నాటకాలు వేశాను. ఈ చిత్రంలో నా పాత్ర పేరు అకిరా. తప్పకుండా నా పాత్ర అందరికి నచ్చతుందనే నమ్మకం ఉంది. రచయిత విజయేంద్ర పసాద్‌ నాకు తాతయ్య వరుస అవుతారు. ఆయన సలహాలు, సూచనలు నా కెరీర్‌ కోసం తీసుకున్నాను. ఈ చిత్ర కాన్సెప్ట్‌తో పాటు ట్రైలర్‌ కూడా నచ్చింది. హనుమంతుడు వేరే లోకలకు ట్రావెల్‌ చేసినప్పుడు అసలు జరిగిందేమిటి అనేది ఈ కథలో మెయిన్‌ పాయింట్‌. ఈచిత్రం నటిగా నాతో పాటు అందరికి మంచి పేరు తీసుకొస్తుంది. ప్రేక్షకులకు ఓ సరికొత్త థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని నమ్ముతున్నాను. దర్శకుడు భరద్వాజ్‌ ఎంతో తపనతో ఈ సినిమా తీశారు. ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం కచ్చితంగా లభిస్తుంది. భవిష్యత్‌లో ఆయన పెద్ద పెద్ద సినిమాలను రూపొందిస్తారు’.