చేతన్ కష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా ‘ధూం ధాం’. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. సాయి కిషోర్ మచ్చా దర్శకుడు. ఈ నెల 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సోమవారం నాయిక హెబ్బా పటేల్ మీడియాతో ముచ్చటించింది. ‘డైరెక్టర్ సాయి కిషోర్ చెప్పిన కథ చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఇలాంటి సినిమా నేను చేసి చాలా కాలమవుతోంది. నాకు రీఫ్రెషింగ్‌గా ఉంటుందని అనిపించి ఓకే చెప్పాను. ఇందులో నా క్యారెక్టర్ పేరు సుహానా. తనొక బబ్లీ గర్ల్. బాగా డబ్బున్న అమ్మాయి. ఇంట్లో ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల తను కోరుకున్న వెకేషన్లకు వెళ్తుంటుంది. అలా ఒక వెకేషన్‌లో హీరోను కలుస్తుంది. అక్కడి నుంచి వారి స్నేహం, ప్రేమ మొదలవుతాయి. గోపీ సుందర్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఈ సినిమాలో చాలా మంది పేరున్న ఆర్టిస్టులు ఉన్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మంచి ఫీల్ గుడ్ చిత్రమిది’.