స్మశానవాటికలో మహిళా అఘోరి హల్చల్

నవతెలంగాణ – వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
రంగశాయిపేట, బెస్తం చెరువు స్మశానవాటికలో బుధవారం రాత్రి మహిళా అఘోరి శవాన్ని దహనం చేసిన చోట కోడిని బలిఇచ్చి పూజలు చేయడం సంచలనంగా మారింది. త్రిశూలాల మధ్య పూజలు చేస్తున్న మహిళ అఘోరిని చూడడానికి ప్రజలు తరలివస్తున్నారు. స్మశానవాటికలో అఘోరి పూజలు చేయడం పట్ల స్థానికులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా మహిళా అఘోరి ప్రవర్తన రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం విధితమే. తాజాగా వరంగల్ బెస్తం చెరువు స్మశానవాటికలో అఘోరి ప్రత్యక్షమవడం సంచనంగా మారింది.