ఆడ మగ పిల్లలు సమాజంలో సమానం..

– ఇద్దరికి కూడా సమాన హక్కులు కల్గి ఉన్నారు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఆడపిల్లలు, మగ పిల్లలు సమాజంలో సమానమని, ఇద్దరికి కూడా సమాన హక్కులు ఉన్నాయని ఐసిడిఎస్ సిడిపిఒ జ్యోతి అన్నారు. మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం, జిల్లా బాలల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పఢావో  పది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిచ్ పల్లి ప్రాజెక్ట్ పరిధిలోని ఇందల్ వాయి మండల పరిధిలోని తిర్మన్ పల్లి గ్రామం వద్ద గిరిజన సంక్షేమ బాలికల గురుకుల  విద్యార్థినీలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఒ జ్యోతి  పాల్గొని మాట్లాడుతూ జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని ఎంపవరింగ్ ద గర్ల్స్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అంటూ బేటి బచావో బేటి పడావో అనే ఐదు ఉద్దేశాలను తెలుపుతుందని వివరించారు.
 ఆడపిల్లల లింగ నిష్పత్తిని పెంచడం, లింగ నిష్పత్తిని తగ్గిదలను అరకట్టాలని పేర్కొన్నారు. ఆడపిల్లలు మగ పిల్లలు సమాజంలో సమానమని తెలుపుతూ ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయని, శిశు భ్రూణ హత్యల పై వివరిస్తూ హత్యలు జరగకుండా ముందుగానే చూసుకోవాలని, పిల్లలపై జరిగే అఘాయిత్యాలు జరగకుండా వాటిని తగ్గించడం ప్రతి ఒక్క కార్యక్రమాల్లో గర్ల్స్ చైల్డ్ పాల్గొనే విధంగా చేయడం, గర్ల్స్ చైల్డ్ ప్రాముఖ్యతను వివరించారు. ఆడపిల్లల ప్రాముఖ్యత ఎందుకు తగ్గుతుందంటే చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయడం ద్వారా భృణ హత్యలకు పాల్పడడం ద్వారా అఘాయిత్యాలు వల్ల ఆడపిల్లలు, పసిపిల్లల మరణాలు ఎక్కువైతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్లలు పసిపిల్లల మరణాలు తగ్గించాలని యూనిసేఫ్ వారి 2018 సెన్సెస్ ప్రకారం 40 శాతం ఆడపిల్లలకు 18 ఏళ్ళ లోపు పెళ్లి జరుగుతున్నాయని  వివరించారు. అలాగే 12 శాతం ఆడపిల్లలు 17 ఏళ్ల లోపు పెళ్లిలు జరుగుతున్నాయని, 15 ఏళ్ల లోపు ఉన్న ఆడపిల్లలకు పెళ్లిళ్లు అవుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు.భారతదేశంలో చూసుకున్నట్లయితే 23% ఆడపిల్లలను 18 ఏళ్ళ లోపు నిండకముందే పెళ్లిళ్లు అవుతున్నాయని దీన్ని 9% తగ్గించాలని బేటి బచావో బేటి పడావో ముఖ్య ఉద్దేశమన్నారు.ఎన్ హెచ్ ఎఫ్ ఎస్ 5 సర్వే ప్రకారం 2021 – 2022 సంవత్సరం గాను 25 సంవత్సరాల తర్వాత ఉన్న ఆడపిల్లలు 30 శాతం మంది కి పెళ్లిళ్లు అవుతున్నాయని 18 సంవత్సరాలలోపు ఉన్న ఆడపిల్లలు 13 శాతం పెళ్లిళ్లు చేసుకుంటున్నారని అలాగే 15 ఏళ్ల ఉన్న ఆడపిల్లలు 12 శాతం మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఒక్క ఆడపిల్లలకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత, ఇవన్నీ ఉంటే ఆడపిల్లలు తప్పకుండా విజయాన్ని సాధిస్తారన్నారు.ఈ కార్యక్రమం లో
సూపర్వైసర్లు శోభ , సునీత, డి హెచ్ ఈ డబ్ల్యూ డి ఎం సి స్వప్న, ప్రిన్సిపల్ పద్మజ ,  ఐ సి పి ఎస్ కౌన్సిలర్ జమురు, చైల్డ్ లైన్ సూపర్వైజర్ భీక్ సింగ్, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ రంజీత్, అంగన్వాడీ టీచర్స్, అద్యాపాకులు తదితరులు పాల్గొన్నారు.