ఆధునిక సమాజంలో ఆడా మగ సమానమేనని మహిళలు పురుషులతో పోటీపడి ముందంజలో ఉంటున్నారని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత అన్నారు. స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో హరిత అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడ పగ పట్ల వేరు భావాన్ని వీడాలని ఇద్దరూ సమానమేనని అన్ని రంగాల్లోనూ మగవారితో సమానంగా మహిళలు రాణిస్తున్నారు అనీ, భారతీయ సాంప్రదాయంలో ఎప్పుడూ ఆడవారిని చిన్న చూపు చూడలేదని కాకపోతే సమాజంలో ఆనాడు ఏర్పడిన పరిస్థితులు ఆడవారు తక్కువ అనే భావాన్ని పాదుకొల్పారనీ మహిళలు ముందుండటానికి నేటి సమాజంలో అందరూ సహకరిస్తున్నారని అన్నారు. రాబోయే సమాజం అంతా నేటి విద్యార్ధులదేనని పోటీ తత్వంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను హరిత, శుభ వాణి, విష్ణుప్రియ,షాజీదా,విజయలక్ష్మి , ఫణి కుమారి లను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.