కాలం చెల్లిన విత్తనాలు అమ్మిన ఫర్టిలైజర్ యజమాని

Fertilizer owner who sold expired seeds– గుట్టు చప్పుడు కాకుండా రైతుకు విత్తనం ప్యాకెట్ ఖరీదు చెల్లించిన వైనం. 

నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణంలోని ఫర్టిలైజర్ వ్యాపారులు దుకాణాలను ఇష్టానసారంగా నిర్వహిస్తున్నారు. కొనుగోలు చేసిన విత్తనాలకు ఎరువులకు బిల్లులు ఇవ్వడం లేదు. ఫర్టిలైజర్ దుకాణాల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. దీంతో ఫర్టిలైజర్ వ్యాపారం కోసం మూడు పువ్వుల ఆరు కాయలు  సాగుతుంది. కాలం చెల్లిన విత్తనాలు అంటూ రైతులను మోసం చేస్తున్నారు. మండల పరిధిలోని సిద్దాపూర్ గ్రామానికి చెందిన బాలయ్య అనే రైతు పట్టణంలోని పద్మాలయ ట్రేడర్స్ దుకాణంలో జులై నెలలో కృష్ణవేణి కంపెనీకి చెందిన om -3 రకానికి చెందిన మిరప విత్తనాలు కొనుగోలు చేశాడు. వ్యవసాయ పొలంలో విత్తనం వేశాడు నెలరోజులు గడిచినప్పటికీ మొలకలు రాకపోవడంతో ఫర్టిలైజర్ యజమాని ప్రశ్నించారు. గుట్టు చప్పుడు కాకుండా రైతుకు కొనుగోలు చేసిన వితరణ ఖరీదు చెల్లించి చేతులు దులుపుకున్నారు. విషయము ఆలోస్యం గా వెలుగులోకి వచ్చింది. రైతు బాలయ్య దగ్గర ఉన్న మిరప విత్తనాల కవర్ ను  పరిశీలించగా లాట్ నెంబర్ KS 00273, డేట్ ఆఫ్ ప్యాకింగ్ ఏది 16-06-2023 , గడువు తేదీ 31-3- 2024 అని ముద్రించి ఉంది. రైతు కొనుగోలు చేసింది జూలై నెలలో కానీ వాస్తవానికి విత్తనాల ప్యాకెట్ మార్చ్ 31 వరకే కాలం చెల్లిపోయింది. ఈ విధంగా కాలం చెల్లిన విత్తనాలను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. బయటకి రానివి మరెన్నో సంఘటనలు ఉన్నాయి. రైతులను మభ్యపెట్టి జరిగిన మోసాలను, అక్రమాలను బయటకు రాకుండా ఫర్టిలైజర్ యజమానులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయంపై జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ దృష్టికి నవ తెలంగాణ తీసుకెళ్లగా విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఫర్టిలైజర్ యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.