ఎరువుల అమ్మకాలు ఈపాస్ మెషిన్ ద్వారానే జరగాలి

 నవతెలంగాణ –  తాడ్వాయి 
తాడ్వాయి రైతు వేదిక నందు విత్తన, పురుగు మందులు మరియు ఫర్టిలైజర్ డీలర్స్ తో మంగళవారం రోజున సమావేశన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా సహాయ వ్యవసాయ సంచాలకులు రత్న  హాజరై పలు సూచనలు చేశారు. ఎరువుల అమ్మకాలు ఈపాస్ మెషిన్ ద్వారానే జరగాలని, అధిక ఎరువులను వాడకుండా రైతులకి సూచనలు ఇవ్వాలని డీలర్స్ ని ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, మండల డీలర్స్ పాల్గొన్నారు.