రైతులకు అందుబాటులో ఎరువులు..

– పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్
 నవతెలంగాణ- తాడ్వాయి 
మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రైతులకు సరిపడే ఎరువులను సిద్ధంగా ఉంచినట్లు పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్  తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయంలో సంపత్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. మండల రైతులకు సరిపడే ఎరువులను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఏలాంటి పరిస్థితుల్లోనైనా ఎరువుల కొరత ఉండకుండా చూసేందుకు ముందుగానే ఎరువుల నిలువలను గోడౌన్లకు తరలించి నిల్వ చేసినట్లు తెలిపారు. సరసమైన ధరలతో ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున మండలంలో అత్యధిక శాతం వరి సాగు ఉన్నందున మొదట డిఎపి వినియోగం అధికంగా ఉంటుందని, యూరియా సాధారణంగా ఎప్పుడు వాడుతానే ఉంటాము కాబట్టి  రైతులు ప్రభుత్వ నిర్ణయిత ధరలకు విక్రయిస్తున్న పి ఎస్ ఎస్ పరిధిలో ఎరువులను కొని పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని అన్నారు. వ్యవసాయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఖరీఫ్ ప్రారంభంలోనే సరిపడా ఎరువుల నిల్వలను తరలించుకున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం, తాడ్వాయి అందిస్తున్న సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.