ఇంటి యజమానులు తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని లేదా ఇంటి స్థలం కలిగి ఉంటే ఇంట్లోనే తడి చెత్త తో ఎరువు తయారు చేసుకోవచ్చని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని నాలుగో వార్డ్ లో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా తడి చెత్త పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒకరు ఎరువును తయారుచేసి మొక్కలకు వాడుకోవచ్చని తెలిపారు. పొడి చెత్తను మున్సిపల్ వాహనానికి అందిస్తే రీసైక్లింగ్ లేదా రియూజ్ చేసుకోవచ్చని, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడడం వల్ల భూ కాలుష్యం పెరిగి పర్యావరణానికి హాని కలుగుతుందని అన్నారు. మార్కెట్ కు వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్లో బదులు సంచులను వాడాలని, ఇకనుండి చెత్త వేరు చేసి ఇవ్వకపోతే జరిమాన విధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అనిత రెడ్డి, కమీషనర్ మల్లిఖార్జున్, సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రవికుమార్, వార్డ్ అధికారి వెంకటేష్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.