సకాలంలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి

నవతెలంగాణ -ఆర్మూర్  

సకాలంలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా సహకార అధికారి సింహాచలం అన్నారు. పట్టణ కేంద్రంలోని రైతు వేదిక యందు భీమ్గల్ ,,ఆర్మూర్ డివిజన్ ఎరువుల డీలర్లకు, సొసైటీ సీఈఓ లకు వ్యవసాయ శాఖ ,సహకార శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం డీలర్లకు అవగాహన కల్పించడం జరిగింది ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా ఎరువులు కావలసిన డీలర్లు ఎప్పటికప్పుడు పై అధికారులకు సమాచారం ఇవ్వాలని ,అధిక ధరలకు ఎరువులను విక్రయించకూడదని, జిల్లాలో ఏ సహకార సంఘం లనైనా ఎరువుల కొరత ఉంటే సంబంధిత కార్యదర్శులపై చర్యలు ఉంటాయని, రైతులెవరు ఆందోళన చెందాల్సిన పని లేదని, యాసంగికి సరిపడా నిల్వలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఏ విజయలక్ష్మి ,మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.