ఈ పాస్ ద్వారానే ఎరువులను విక్రయించాలి

Fertilizers should be sold through this pass– జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్
నవతెలంగాణ – భీంగల్
ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ పాస్ ద్వారానే ఎరువులను విక్రయించాలని ఎరువుల దుకాణ యజమానులకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  వాజిద్ హుస్సేన్  సూచించారు. శుక్రవారం పట్టణంలోని ఎరువుల దుకాణాలను ఏడిఏ మల్లయ్య తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాలలోని స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు. ప్రతి దుకాణ యజమాని స్టాకు వివరాలను బోర్డుపై  కనిపించే విధంగా ఉంచాలని సూచించారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన  ఈపాస్  ద్వారా ఎరువులను  విక్రయించాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.  ఈ తనిఖీ  లో ఏడిఏ మల్లయ్య, ఏఈవో లక్ పతి లు ఉన్నారు.