నసురుల్లాబాద్ లో చెరువుల పండగ

నవతెలంగాణ – నసురుల్లాబాద్
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఊర చెరువు వద్ద పండగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మలతో మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మలాడి గంగమ్మ అమ్మవారి కి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం చెరువు ప్రాంతం వద్ద అన్నదానాన్ని ఏర్పాటు చేయగా భారీ సంఖ్యలో గ్రామస్తులు చేరుకొని ఉత్సవాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవంతం చేసిన గ్రామస్తులకు పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ ఎంపిపి పాల్త్య విఠల్ సర్పంచ్ అరిగే సాయిలు, ఎంపీటీసీ లక్ష్మినారాయణ గౌడ్, పార్టీ బిఆర్ఎస్ అధ్యక్షులు కంది మల్లేష్ ఐకెపి సిబ్బంది, అంగన్ వాడి సిబ్బంది రెవెన్యూ సిబ్బంది , గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు పంచాయతీ పాలకొల్లు సభ్యులు గ్రామస్తులు ఉన్నారు.