
పెంచల మండలం నీలా గ్రామంలో బుధవారం అంగన్వాడీ కేంద్రాలలో పోషక హారవారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులకు అన్న ప్రసన్న, అక్షరాభ్యాసం, గర్భిణీ లకు సీమంతాలు, గర్భిణీ బాలింత మహిళలకు పోషకాహారం పై అవగాహన కల్పించారు. అంగన్వాడి కేంద్రంలో ప్రభుత్వం అందించే బాలమృతం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చిన్నారులకు, గర్భిణీ బాలింత మహిళలకు పోషకాహారం అందించడానికి ముందుకు వచ్చిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి నెల చిన్నారుల ఎత్తుపరుగులను కొలిచి వారికి సరైనటువంటి పౌష్టికాహారాన్ని అందజేయడం జరుగుతుందని వారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, రాజశ్రీ, ఖతిజా బేగం, పర్వవ, స్రవంతి, మంజుల, ఆశలు అజ్మీరి ,ప్రమీల, ఏ ఎల్ ఎం ఎస్ సి కమిటీ సభ్యులు, ఐకెపి సభ్యులు, గర్భిణీ బాలింత మహిళలు పాల్గొన్నారు.