ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి

– గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్‌పర్సన్‌ రజనీసాయిచందు
నవతెలంగాణ-మంచాల
గణేష్‌ నవరాత్రుల ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని గిడ్డంగుల సంస్థ తెలంగాణ రాష్ట్ర చైర్‌పర్సన్‌ రజనీసాయిచందు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని లోయపల్లి గ్రామంలో బంటి అన్న యూత్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్‌ మండపంలో వినాయకుని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్‌పర్సన్‌ రజనీ సాయిచందు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉంత్సవ కమిటీ సభ్యులు గణేష్‌ ఉత్సవాల్లో ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.