
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : ఆర్పిలు, ఆశ వర్కర్లు ఫీవర్ సర్వే తో పాటు లార్వా సర్వే కూడా చేయాలని జిల్లా మలేరియా అధికారి గంగప్ప కోరారు. గురువారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో ఫీవర్ సర్వే పై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీవర్ సర్వే చేసిన ఇళ్ళలో జ్వరంతో బాధపడే వ్యక్తులు ఉన్నట్లైతే వారి వివరాలు సేకరించి మరుసటి రోజు వారి గురించిన వివరాలు మరల కనుక్కోవాలి అని పేర్కొన్నారు. లార్వా నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వెంటనే వాటిని శుబ్రపరచాలని సిబ్బందికి సూచించారు. రోజు సర్వేచేసిన 50 ఇళ్ళకు సంబందించిన వివరాలు నోట్ చేసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ ముసబ్ అహ్మద్ మట్లాడుతూ నేటి నుండి 48 వార్డులలో ఆర్పి లు, ఆశ వర్కర్లు కలిసి ఫీవర్ సర్వే, లార్వ సర్వే చేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో మెడికల్ ఆఫీసర్లు, మెడికల్ సూపర్వైజర్లు, మెప్మా సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.