నవతెలంగాణ పెద్దవంగర: మండలంలోని రామచంద్రు తండాలో పారిశుధ్యం పడకేసింది. తండా లోని గ్రామపంచాయతీ సమీపంలో డ్రైనేజీ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. మురుగు బయటకు సరిగా వెళ్లడం లేదు. దీంతో దుర్గంధం వస్తుందని, ఈగలు, దోమలు ఎక్కువై తండాలో జనం జ్వరాల బారిన పడుతున్నారు. చెత్తా చెదారాన్ని కూడా శుభ్రం చేయడం లేదు. పంచాయతీ అధికారులు తండాను సందర్శించి, చెత్తా చెదారం లేకుండా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి.