మొబైల్ యాప్ ద్వారా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన..

Field level examination of LRS applications through mobile app..నవతెలంగాణ – డిచ్ పల్లి
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యటించి మొబైల్ – యాప్ ద్వారా పరిశీలించారు. బుధవారం ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామంలో ఎల్ అర్ఎస్ లో వచ్చిన దరఖాస్తులను ఎంపిఓ రాజ్ కాంత్ రావు, మండల రెవెన్యూ అధికారి మోహన్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఇతరులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, ముందుగా అన్ని దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు ఉండే విధంగా చూడాలని ఎంపిఓ రాజ్ కాంత్ రావు అన్నారు. ఎల్ఆర్ఎస్ లో చేసుకున్న దరఖాస్తుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి జియో ట్యాగింగ్ ద్వారా ఎల్ ఆర్ ఎస్ 2020యాప్లో నమోదు చేసినట్లు వారు  తెలిపారు. వారి వెంట కారోబర్, దరఖాస్తు దారులు ఉన్నారు.