పథకాలపై క్షేత్రస్థాయిలో సర్వే..

Field level survey on the schemes..నవతెలంగాణ – భువనగిరి
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి ప్రభుత్వ పధకాలు అర్హులైన లబ్ధిదారులకు అందజేయడం కోసం క్షేత్రస్థాయిలో  సర్వే నిర్వహిస్తున్నామని  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. శుక్రవారం వారం  యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని  యాదగిరి పల్లి, తుర్కపల్లి మండలంలోని  వెలుపులపల్లి, బొమ్మలరామారం మండలం లోని ప్యారారం గ్రామం, బీబీనగర్ మండలం  గ్రామ పంచాయతీ, భువనగిరి మండలం లోని అనంతారం గ్రామంలో లలోరైతు భరోసా, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఆయా సర్వే నంబర్లు లలో గల రైతులకు  సంబంధించిన పట్టా భూములను, అసైన్డ్ స్థలాలను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్వే లో భాగంగా వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్లి  రైతు దగ్గర నుండి వివరాలు సేకరించారు. కలెక్టర్ రైతు తో మాట్లడుతూ ఎంత వ్యవసాయ భూమి ఉందని, దానిలో ఎంత మేరకు ఇల్లు, ప్లాట్లు చేయడం జరిగిందని  ఆరా తీశారు. ఇందులో వ్యవసాయ యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా  వర్తిస్తుందని తెలిపారు. అర్హుల ఎంపిక ఎంత ముఖ్యమో అనర్హుల ఏరి వేత  అంతే ముఖ్యం అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకూ అనుగుణంగా రైతు భరోసా పథకానికి  సంబంధించిన వ్యవసాయ  యోగ్యమైన  భూములకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు. భూభారతి (ధరణి ) పోర్టల్ లో  నమోదైన వ్యవసాయ భూములకే రైతు భరోసా చెల్లిస్తుందని, లేఅవుట్లు చేసిన భూములు,రాళ్లు, రప్పలు, నాలా కన్వర్షన్,  చేసిన భూములు, సాగుకు అనువుగా లేని  భూములను నిశితం గుర్తించి  రైతు భరోసా తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రేషన్ కార్డు ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ప్రకారం పలు లబ్ధిదారుల ఇళ్ల కు వెళ్లి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇంటి సభ్యులతో మాట్లాడారు ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు వుంటారని , ఏమి వృత్తి చేస్తారు, ఇల్లు ఎవరి పేరు మీద ఉందని, ఏమి అయినా పొలం వుందా అని వివరాలు సేకరించారు. రికార్డులను పరిశీలించారు.ఫీల్డ్ వెరిఫికేషన్ లో తప్పిదాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా  లబ్ధిదారుల  జాబితాను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దారిద్ర రేఖకు  దిగువన ఉన్న  వారికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో యాదగిరిగుట్ట మండల తహసీల్దార్ దేశ్య , వ్యవసాయ అధికారి సుధా రాణి,  తుర్కపల్లి  ఎంపీడీవో  ఝాన్సీ భాయ్,శ్రీ ఉమా, బొమ్మలరామారం తహసీల్దార్  శ్రీనివాస్,బీబీనగర్ తహసీల్దార్,భువనగిరి ఎంపీడీవో  శ్రీనివాస్  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.