నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఇనాయత్ నగర్ గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి వజిద్ హుస్సేన్ రుణమాఫీపై క్షేత్ర పర్యటన చేశారు. ఇటీవల ప్రభుత్వం మొదటి విడతలో చేసిన రుణమాఫీ వల్ల లబ్ధి పొద్దిన రైతులతో క్షేత్ర స్థాయిలో పర్యటించి లబ్ధిదారులతో మాట్లాడి వారి నుండి రుణమాఫీ పైన అభిప్రాయాలు అడిగి తెలుసుకొన్నారు.ఈ ప్రభుత్వం రుణమాఫీ చేయడం వల్ల సంతోషంగా ఉన్నట్లు రైతులు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఇంకా లక్ష లోపు అర్హత ఉండి రుణమాఫీ కానీ రైతులు వున్నట్లయితే బ్యాంక్, వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన రైతులకు సూచించారు.
పంటల నమోదు పరిశీలన..
ఇనయత్ నగర్ గ్రామంలో జరుగుతున్న పంటల నమోదును జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ శుక్రవారం పరిశీలించారు.మండలంలోని అన్ని క్లస్టర్ ల పరిధిలోని ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి రైతులు వేసిన పంట వివరాలు ఆన్లైన్ లో జాగ్రతగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి సాయిరాం రాజు, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.